అగ్ర కథానాయకుడు చిరంజీవితో కలిసి మరోసారి నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది కాజల్ అగర్వాల్. వీళ్లిద్దరూ ఇదివరకు 'ఖైదీ నంబర్ 150'లో జోడీ కట్టారు. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' తెరకెక్కుతోంది. ఇందులో నాయికగా మొదట త్రిష ఎంపికైంది. అయితే ఆమె ఇటీవల సినిమా నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది.
మరోసారి వెండితెరపై 'ఖైదీ 150' కాంబో - latest chiranjeevi news
మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న 'ఆచార్య' చిత్రంలో హీరోయిన్ ఖరారైంది. కాజల్‌ని ఎంపిక చేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

'ఖైదీ 150' కాంబో రొమాన్స్ రిపీట్
ఫలితంగా అనుష్కతో పాటు పలువురు నాయికల పేర్లు వినిపించాయి. తాజాగా 'ఆచార్య' బృందం కాజల్‌ని ఖాయం చేసింది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అతడి సరసన నటించే కథానాయిక కోసం ప్రస్తుతం కసరత్తులు జరుగుతున్నాయి.
ఇదీ చూడండి : 'కరోనా' గాయని కనికాపై ఎఫ్ఐఆర్ నమోదు