స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal).. పెళ్లి తర్వాత వరుస సినిమాలతో దూకుడు చూపిస్తోంది. చిరంజీవి 'ఆచార్య' చేస్తున్న ఈ భామ.. నాగార్జునతోనూ కలిసి నటిస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్ వేశ్య పాత్రలో కనిపించనుందని సమాచారం. వేశ్యగా ఉంటూనే రహస్య సమాచారాన్ని చేరవేసే స్పై(Kajal as Spy)గానూ నటించనుందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే తన కెరీర్లో కాజల్ ఇలాంటి పాత్ర చేయడం ఇదే తొలిసారి అవుతుంది.
kajal:పెళ్లి తర్వాత సాహసం.. వేశ్య పాత్రలో కాజల్! - స్పై పాత్రలో కాజల్
గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్(Kajal Aggarwal).. సినిమాల్లో సాహసం చేసేందుకు చేసేందుకు సిద్ధమైంది. తన కొత్త సినిమాలో వేశ్యగా నటిస్తున్నట్లు సమాచారం.
పెళ్లి తర్వాత కాజల్ సాహసం.. ఆ సినిమాలో వేశ్యగా!
స్పై-యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున(Nagarjuna) రా(RAW) ఏజెంట్‌గా నటిస్తున్నారు. నాగ్ కోసం పనిచేసే స్పై పాత్రలో కాజల్ మెరవనుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
ఇదీ చూడండి..సినిమాలకు కాజల్ గుడ్‌బై.. భర్తతో కలిసి..!