తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Kajal Agarwal: సినిమాలకు కాజల్ గుడ్​బై.. భర్తతో కలిసి..! - kajal gautam kitchlu news

దక్షిణాదితో పాటు హిందీలోనూ నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్.. త్వరలో సినిమాలకు రిటైర్మెంట్​ ప్రకటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.

Kajal Aggarwal planning to quit movies
కాజల్ అగర్వాల్

By

Published : Jun 12, 2021, 1:33 PM IST

హీరోయిన్ కాజల్​ అగర్వాల్.. పెళ్లి చేసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే త్వరలో ఆమె సినీ కెరీర్​కు గుడ్​బై చెప్పనుందనే వార్త ఇటీవల బయటకొచ్చింది. నటనకు వీడ్కోలు పలికిన తర్వాత భర్తతో కలిసి బిజినెస్​ చూసుకుంటుందని అని చర్చించుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజమనే దానిపై ఆమెనే స్పందించాల్సి ఉంది.

భర్తతో కాజల్ అగర్వాల్

తన ప్రియుడు గౌతమ్ కిచ్లూను గతేడాది అక్టోబరులో పెళ్లి చేసుకుంది కాజల్. ఆ తర్వాత కొన్నిరోజులకే 'ఆచార్య' సెట్​లో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు ఆరు సినిమాలు ఉన్నాయి. వాటిని పూర్తిచేసినా సరే 2022 పూర్తయిపోతుంది. అయితే కెరీర్​కు టాటా చెప్పే విషయమై గతంలోనూ ఇలానే వార్తల వచ్చినప్పుడు ఈ ముద్దుగుమ్మ మాట్లాడింది.

ABOUT THE AUTHOR

...view details