తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Prabhas Kajal: ప్రభాస్​తో కాజల్.. పదకొండేళ్ల తర్వాత! - Kajal prabhas news

డార్లింగ్, మిస్టర్ ఫర్​ఫెక్ట్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న క్యూట్ జోడీ ప్రభాస్-కాజల్.. మళ్లీ కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారట. ఇది ఏం సినిమా కోసం? ఇంతకీ ఇది నిజమేనా?

Kajal Aggarwal in Talks for Special Number in Prabhas' Salaar
ప్రభాస్ కాజల్

By

Published : Jul 5, 2021, 9:44 PM IST

రెబల్​స్టార్ ప్రభాస్​ కాజల్ అగర్వాల్ జోడీకి హిట్​ అండ్ లవ్​లీ పెయిర్​ అని గుర్తింపు ఉంది. వారిద్దరూ కలిసి రెండు సినిమాల్లోనే నటించినా, అభిమానుల మనసుల్లో మాత్రం అలా ఉండిపోయారు. డార్లింగ్(2010), మిస్టర్ ఫర్​ఫెక్ట్(2011) మాత్రమే జంటగా చేసిన వీరిద్దరూ.. దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి తెర పంచుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. అది 'సలార్' చిత్రం కోసమని తెలుస్తోంది.

కాజల్ ఈ ఆఫర్​కు ఒప్పుకొంటుందా?

'సలార్​'లోని ప్రత్యేక గీతం కోసం చిత్రబృందం కాజల్​ను సంప్రదించిందని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే పెళ్లి తర్వాత పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కాజల్.. ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తుందా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో నిజం ఎంతనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

హీరోయిన్ కాజల్

ప్రశాంత్​ నీల్ సినిమా.. స్పెషల్ సాంగ్

ప్రశాంత్​ నీల్​ దర్శకత్వం వహించిన 'కేజీఎఫ్'లో స్టార్ హీరోయిన్​ తమన్నా స్పెషల్​ సాంగ్​లో ఆడిపాడింది. హిందీ వెర్షన్​లో మౌనీ రాయ్​ స్టెప్పులతో అదరగొట్టింది. మరి సలార్​లో ప్రత్యేక గీతం ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మరి అందులో ప్రభాస్​తో కాలుకదిపే ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.

కాజల్ బిజీ బిజీ

ప్రస్తుతం కాజల్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. బిజినెస్​మ్యాన్ గౌతమ్​ను పెళ్లి చేసుకున్న ఆమె.. అంతకంటే ముందు ఒప్పుకొన్న చిత్రాలనే కరోనా కారణంగా ఇంకా పూర్తిచేయలేదు. కాజల్ హీరోయిన్​గా నటించిన 'ఇండియన్ 2'(తమిళం) మధ్యలోనే ఆగిపోయింది. 'ప్యారిస్ ప్యారిస్'(తమిళం) రెండేళ్ల నుంచి రిలీజ్​ కాక ఇబ్బందులు పడుతోంది. వీటితో పాటు చిరంజీవి ఆచార్య(తెలుగు), హే సినామిక, ఉమ సినిమాల్లో నటిస్తోంది.

సలర్ సంగతులు

యాక్షన్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతున్న 'సలార్​'లో ప్రభాస్​ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్​గా చేస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్​లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.

సలార్​లో ప్రభాస్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details