తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరోయిన్ కాజల్ ప్రెగ్నెంట్.. భర్త గౌతమ్ ఇన్​స్టాలో పోస్ట్ - kajal acharya movie

Kajal pregnant: దక్షిణాదిలో ఎన్నో సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీతో ఉంది. ఈ విషయాన్ని ఆమె భర్త గౌతమ్ కిచ్లూ చెప్పారు.

Kajal Aggarwal pregnant
కాజల్ ప్రెగ్నెన్సీ

By

Published : Jan 2, 2022, 10:21 AM IST

Updated : Jan 2, 2022, 11:34 AM IST

Kajal aggarwal news: హీరోయిన్ కాజల్​.. ప్రస్తుతం సినిమాలు ఏవి చేయడం లేదు. 'ఆచార్య' షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసి భర్తతో సమయాన్ని ఆస్వాదిస్తోంది. అయితే ఆమె గర్భవతి అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ న్యూ ఇయర్ సందర్భంగా కాజల్ భర్త గౌతమ్ కిచ్లూ ఇన్​స్టా వేదికగా ఈ విషయాన్ని తెలిపారు.

కాజల్ ఫొటోను పోస్ట్ చేసిన గౌతమ్.. ప్రెగ్నెంట్​ ఉమన్ ఏమోజీని క్యాప్షన్​లో పోస్ట్ చేశారు. తద్వారా అధికారికంగా ఈ విషయాన్ని చెప్పినట్లయింది. ఈ జంటకు 2020 అక్టోబరు చివర్లో పెళ్లి అయింది.

కాజల్ హీరోయిన్​గా.. తమిళంలో 'కరుంగపియమ్', 'ఘోష్టీ', 'హే సినామిక' సినిమాల షూటింగ్ పూర్తయింది. తెలుగులో 'ఆచార్య', హిందీలో 'ఉమ' చిత్రీకరణ కూడా పూర్తయింది. 'ఇండియన్ 2'(తెలుగులో భారతీయుడు 2)లో హీరోయిన్​గా నటిస్తోంది. 'క్వీన్' తమిళ రీమేక్ 'పారిస్ పారిస్'(తమిళం) రిలీజ్ కావాల్సి ఉంది.

ఇవీ చదవండి:

Last Updated : Jan 2, 2022, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details