తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆనందం అదుపు చేసుకోలేకపోతున్న కాజల్ అగర్వాల్ - mahesh babu

మేడమ్​ టుస్సాడ్స్​లో తన మైనపు విగ్రహాన్ని మరో నాలుగు రోజుల్లో ఆవిష్కరించనున్న సందర్భంగా, ఓ ట్వీట్ చేసింది హీరోయిన్ కాజల్ అగర్వాల్.​

ఆనందాన్ని తట్టుకోలేకపోతున్న కాజల్ అగర్వాల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్

By

Published : Feb 1, 2020, 5:06 PM IST

Updated : Feb 28, 2020, 7:06 PM IST

హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆనందాన్ని ఆపుకోలేకపోతుంది. అందుకు కారణం స్టార్ హీరో సినిమాలో అవకాశమో, మరో విషయమో కాదు. మరో నాలుగు రోజుల్లో ఆమె మైనపు విగ్రహాన్ని.. సింగపూర్​లోని మేడమ్ టుస్సాడ్స్​ మ్యూజియంలో ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగానే ట్విట్టర్​లో తన ఆనందాన్ని పంచుకుంది. "విగ్రహా ఆవిష్కరణ తేదీకి మనం దగ్గరపడుతున్నాం" అంటూ ట్వీట్ చేసింది.

ఈ మ్యూజియంలో భారతదేశానికి చెందిన ప్రభాస్, మహేశ్​బాబు, శ్రీదేవి, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్​ వంటి ప్రముఖ నటుల మైనపు విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు వారి పక్కన తను చోటు సంపాదించడంపై కాజల్ తెగ ఆనందపడిపోతోంది.ప్రస్తుతం కమల్​హాసన్ 'భారతీయుడు-2', మంచు విష్ణుతో 'మోసగాళ్లు' సినిమాలో హీరోయిన్​గా నటిస్తోంది.

మరో నాలుగు రోజుల్లో కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహం ఆవిష్కరణ
Last Updated : Feb 28, 2020, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details