తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు కాజల్ అగర్వాల్​

గతంలో మెగాస్టార్ చిరంజీవి తన కొత్త సినిమా టైటిల్​ లీక్ చేయగా, ఇప్పుడు హీరోయిన్ కాజల్ అగర్వాల్.. చిరు పక్కన తను మరోసారి నటిస్తున్నట్లు స్పష్టం చేసింది. వీటిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటనలు రాలేదు.

ఆచార్య సినిమా
చిరంజీవి కాజల్

By

Published : Mar 22, 2020, 5:13 PM IST

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా 'ఆచార్య'. కరోనా కారణంగా ఇప్పటికే చిత్రీకరణ వాయిదా పడింది. ఇందులో తొలుత హీరోయిన్​గా అనుకున్న త్రిష.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకుంది. ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్​ను ఎంపిక చేశారంటూ కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయంపై స్పష్టతనిచ్చిందీ భామ. 'జనతా కర్ఫ్యూ' సందర్భంగా ఇన్​స్టా లైవ్​లోకి వచ్చిన కాజల్.. చిరు పక్కన మరోసారి నటిస్తున్నట్లు చెప్పింది.

కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ సినిమా ప్రీరిలీజ్​ ఈవెంట్​లో తన 152వ సినిమా టైటిల్​ను లీక్​ చేశాడు మెగాస్టార్. అధికారికంగా ప్రకటించకుండానే తమ చిత్రానికి 'ఆచార్య' పేరు పెట్టినట్లు చెప్పేశాడు. ఇప్పుడు కాజల్ అలానే ఎటువంటి అధికారిక ప్రకటన లేకుండానే తను ఈ ప్రాజెక్టులో నటిస్తున్నట్లు ఖరారు చేసింది.

ఇది చదవండి:అమ్మ దగ్గర ఆవకాయ చేయడం నేర్చుకుంటున్న హీరో

ABOUT THE AUTHOR

...view details