హీరోయిన్ కాజల్ అగర్వాల్, తన భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి, ముంబయిలో తొలి డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకుంది. అందుకు సంబంధించిన ఫొటోల్ని ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.
హీరోయిన్ కాజల్ దంపతులకు కరోనా వ్యాక్సిన్ - celebrities Covid-19 vaccine
హీరోయిన్ కాజల్.. కొవిడ్ తొలి డోసు వ్యాక్సిన్ తీసుకుంది. ముంబయిలోని నానావతి ఆస్ప్రత్రిలో టీకా వేసుకుంటున్న ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కాజల్ అగర్వాల్
ముంబయికి చెందిన పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లూతో గతేడాది అక్టోబరులో కాజల్ పెళ్లి జరిగింది. ఆ తర్వాత సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంది. కానీ ఇటీవల కరోనా సెకండే వేవ్ దృష్ట్యా, బయటకు వెళ్లకుండా భర్తతో కలిసి సమయాన్ని ఆస్వాదిస్తోంది.
ప్రస్తుతం ఈమె తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య'లో నటిస్తోంది. దీని షూటింగ్ కూడా కరోనా కారణంగా నిలిచిపోయింది.