తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్లోనూ గుర్తింపు తెచ్చుకున్న నటి కాజల్ అగర్వాల్. ప్రస్తుతం కమల్ హాసన్ సరసన 'భారతీయుడు 2'లో నటిస్తోన్న ఈ భామ పెళ్లికి సిద్ధపడుతుందట. ఈ విషయాన్నే ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
"త్వరలోనే పెళ్లి విషయాన్ని అందరికి తెలియజేస్తా. ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. నన్ను బాగా చూసుకునే వ్యక్తి నాకు భర్తగా రావాలి. అతడిలో నా కంటే ఎక్కువగా దైవభక్తి ఉండాలి.ఎందుకంటే నాకు దైవభక్తి ఎక్కువ.షూటింగ్ కోసం నేను ఎక్కడికెళ్లినా శివుడు విగ్రహాన్ని వెంట తీసుకెళ్తా" - కాజల్ అగర్వాల్, హీరోయిన్