కరోనా కారణంగా ఏర్పడ్డ లాక్‌డౌన్ పరిస్థితులతో చిత్రీకరణలు లేక ఇంటికే పరిమితమయ్యారు సినీతారలంతా. ఇప్పుడీ అనుకోని విరామ సమయన్ని తారలంతా ఒక్కొక్కరూ ఒక్కో తరహాలో సద్వినియోగం చేసుకుంటున్నారు. అందాల చందమామ కాజల్ మాత్రం దూరదర్శన్‌లో 'రామాయణ', 'మహాభారతం' ధారావాహికలను చూస్తూ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటోంది. తాజాగా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది.
దేశంలో ఏర్పడ్డ లాక్‌డౌన్ పరిస్థితుల వల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో ఉత్సాహం నింపేందుకు వాళ్ల కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం దూరదర్శన్ ఛానెల్స్‌లో 30ఏళ్ల నాటి విజయవంతమైన 'రామాయణం', 'మహాభారతం' సీరియళ్లను ప్రసారం చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పుడీ క్రమంలోనే కాజల్ కూడా తన ఇంట్లో కూర్చోని 'రామాయణం' చూస్తూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది.