తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇంట్లోనే జాగ్రత్తగా ఉందాం: కాజల్ - కరోనా గురించి కాజల్ అగర్వాల్

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ సమయంలో బేరసారాలు వద్దని అందరం జాగ్రత్తగా ఉందామని చెబుతోంది నటి కాజల్ అగర్వాల్.

Kajal Agarwal
కాజల్

By

Published : Apr 19, 2021, 6:24 PM IST

కరోనా అనేక మార్గాల్లో మన సహనాన్ని పరీక్షిస్తోందని.. దానితో బేరాలు వద్దని నటి కాజల్‌ అగర్వాల్‌ పేర్కొంది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో కాజల్‌ తన అభిమానులను ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పంచుకుంది.

"ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఈ ప్రపంచం ప్రమాదకరమైన ప్రదేశంగా మారింది. ఈ పరిస్థితుల్లో మనకోసం ఎంతో శ్రమించే మన ఆరోగ్య వ్యవస్థను కాపాడుకోవడానికి ఇంట్లోనే ఉందాం. జాగ్రత్తగా ఉందాం" అంటూ ఆమె రాసుకొచ్చింది.

"మీరు ఎప్పుడైనా ఎవరినైనా త్యాగం చేశారా? ఓ కొత్త కుటుంబానికి కూతురిని.. కాలేజీకి సోదరుడిని.. వయసు మళ్లిన గ్రాండ్‌పేరెంట్స్‌ని‌.. అపార్థానికి స్నేహాన్ని.. మౌనానికి ప్రేమించే వ్యక్తిని.. ప్రేమలేని అనుబంధాలకు మిమ్మల్ని.. ఒక పెంపుడు జంతువును ఏదైనా దీర్ఘకాలిక వ్యాధికి.. అలాగయితే నష్టమంటే ఏంటో మీకు తెలిసే ఉంటుంది. విషాదంతో బేరసారాలు వద్దు. నొప్పి మనకే.. గ్రహాంతరవాసికి కాదు. దానికి మనం స్పందించే విధానమే మనకు శత్రువు" అని కాజల్ పేర్కొంది.

ప్రస్తుతం చిత్రసీమపై కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒకరి తర్వాత ఒకరికి సోకుతూ సినీ పరిశ్రమను కలవరపాటుకు గురిచేస్తోంది. దీంతో సినిమా విడుదల.. చిత్రీకరణలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా.. ప్రముఖ నటులు పవన్‌కల్యాణ్‌, సోనూసూద్‌, నిర్మాత దిల్‌రాజు, హీరోయిన్‌ నివేదా థామస్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్‌, మాధవన్‌, కత్రినా కైఫ్‌.. ఇలా చాలామంది సినిమా ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details