"కరోనా వ్యాప్తి కారణంగా ప్రస్తుతం పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. మన చుట్టూ ఓ నిస్సహాయత, తెలియని ఆందోళన కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదోక పనిపై మనస్సును కేంద్రీకరించడం ద్వారా మానసిక ఒత్తిడిని జయించవచ్చు" అంటోంది నటి కాజల్ అగర్వాల్. మాటల్లో చెప్పడమే కాదు.. దీన్ని తాను స్వయంగా అనుసరిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది.
కుట్లుఅల్లికలతో కాజల్ కాలక్షేపం - కాజల్ అగర్వాల్ లేటెస్ట్ న్యూస్
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంటికే పరిమితమైన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్..ఇప్పుడీ విరామ సమయంలో కుట్లుఅల్లికలతో కాలక్షేపం చేస్తోందట. ప్రస్తుతం ఆమె నూలు దారంతో అందమైన అల్లికల్ని ప్రయత్నిస్తున్నట్లు ఇన్‌స్టా ద్వారా తెలియజేసింది. దీంతో పాటు ఓ చక్కటి సందేశాన్ని కాజల్ రాసుకొచ్చింది.
"ఇప్పుడున్న పరిస్థితుల్లో మానసిక ఒత్తిడిని దరి చేరనీయకుండా చూసుకోవడం ముఖ్యం. ఇందుకోసం మన మనస్సులను ఏదోక పనిపై కేంద్రీకరించాలి. అది ఏదైనా కావొచ్చు. సృజనాత్మకంగా అనుభూతి చెందడం ఈ సమయంలో చాలా అవసరం. నేను ఇటీవల అల్లికలు చేస్తున్నా. ఇది నాకు విశ్రాంతిని కలిగించడం సహా మానసిక క్షేమాన్ని అందిస్తోంది. ఇతరుల కోసం ఏదైనా సృష్టించడం నిజంగా చికిత్సా విధానం. మరి ఈ ఖాళీ సమయంలో ఇంట్లో ఉండి మీరు ఏమి చేస్తున్నారు?" అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది కాజల్. ఆమె ప్రస్తుతం చిరంజీవికి జోడీగా 'ఆచార్య'లో నటిస్తోంది.
ఇదీ చూడండి:కల్యాణ్‌రామ్ కొత్త సినిమా 'ఎమిగోస్'!