వెండితెరపై తన జోరు చూపించేందుకు సిద్ధమవుతోంది కాజల్ అగర్వాల్. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన ఈ భామ తాజాగా మరో బడా హీరో సినిమాకు ఓకే చెప్పిందని సమాచారం.
మరో బడా హీరో సినిమాలో కాజల్!
హీరోయిన్ కాజల్ అగర్వాల్ కోలీవుడ్ స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. విజయ్-మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఓ చిత్రంలో నటించబోతుందని తెలుస్తోంది.
మరో పెద్ద హీరో సినిమాలో కాజల్!
కోలీవుడ్‌లో విజయ్ సరసన కాజల్ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ సినిమా రూపొందబోతుంది. తాజాగా ఈ చిత్రం కోసం కాజల్‌ను హీరోయిన్గా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందట.
టాలీవుడ్, కోలీవుడ్ కాక బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది కాజల్. ప్రస్తుతం సంజయ్ గుప్తా దర్శకత్వంలో రూపొందుతోన్న 'ముంబయి సాగా' చిత్రంలోనూ నటిస్తోంది.