తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కాజల్ ప్రేమకథ: ఫోన్ నంబర్ నుంచి పెళ్లి వరకు

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన ప్రేమకథ గురించి చెప్పింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఫోన్​ నంబర్ కోసం వెతుకులాట నుంచి పెళ్లి పీటల వరకు సాగిన తమ ప్రేమ ప్రయాణాన్ని వివరించింది.

kajal agarwal love story with gautam kitchlu
కాజల్ ప్రేమకథ: ఫోన్ నంబర్ నుంచి పెళ్లి వరకు

By

Published : Feb 14, 2021, 7:01 AM IST

చందమామ కాజల్‌ అగర్వాల్‌ గౌతమ్‌ కిచ్లూతో ఏడడుగులేసి కాజల్‌ కిచ్లూగా మారింది. ప్రేమ వివాహంతో ఒకటైన ఈ జంట.. మరోవైపు కెరీర్‌లోనూ దూసుకెళ్తున్నారు... 'ఇది మా పెళ్లి తర్వాత వచ్చిన తొలి ప్రేమికుల దినోత్సవం. అందుకే ఇది నాకు చాలా ప్రత్యేకం' అంటున్న కాజల్‌ తన ప్రేమకథను చెప్పుకొచ్చిందిలా..

తొలి చూపులోనే గౌతమ్‌ నన్ను ప్రేమించేశాడు. ఓ పెళ్లిలో నన్ను చూసి, నా ఫోన్‌ నంబర్‌ కోసం చాలా ప్రయత్నించాడట. చివరికి ఎలా అయితేనే పట్టుకున్నాడనుకోండి. 'కాఫీ తాగుదాం వస్తారా?' అని నన్ను అడిగి ఒప్పించడానికి తనకు రెండు రోజులు పట్టింది. అప్పటివరకు తనెవరో నాకు తెలియదు. తొలిచూపులోనే నేను తనకు చాలా నచ్చానట. చాలా తక్కువ సమయంలోనే తను నాకు మంచి స్నేహితుడిగా మారాడు. తనకు నాతో జీవితాన్ని పంచుకోవాలని ఉండేది. నాపై నాకు నమ్మకం వచ్చేంతవరకూ పెళ్లి గురించి మాట్లాడటం ఇష్టం ఉండేది కాదు. దాంతో తను కూడా పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చేవాడు కాదు. స్నేహితులుగా ఉన్న మా మధ్య ప్రేమ ఎప్పుడు చిగురించిందో మాకే తెలీదు. మా ప్రేమను ఉత్తరాల ద్వారా వ్యక్తీకరించుకునేవాళ్లం.

భర్త గౌతమ్​తో కాజల్

కొవిడ్‌ మమ్మల్ని మరింత దగ్గర చేసిందనే చెప్పాలి. లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని వారాలపాటు మేం కలుసుకోలేకపోయాం. మేం కలవడానికి మూడు వారాలు పట్టింది. ఆ తర్వాత ఓ దుకాణంలో మాస్క్‌ వేసుకుని కలిశాం. అప్పుడే తెలిసింది... మేమెంత ప్రేమలో మునిగిపోయామో అని. జీవితాంతం కలిసి ఉండాలని మా మనసులు కోరుకుంటున్నాయని తెలుసుకున్నాం. 'నీతో ఏడడుగులు నడిచి జీవితాన్ని పంచుకోవాలని ఉందని' గౌతమ్‌ చెప్పిన సందర్భాన్ని జీవితంలో మర్చిపోలేను. చాలా భావోద్వేగంగా మాట్లాడాడు. అంతే పెళ్లికి ఒకే చెప్పేశా. ఓ మంచి స్నేహితుడు నాకు భర్తగా దొరికాడు. అలా ఇద్దరం వివాహబంధంతో ఒక్కటయ్యాం.

మేమిద్దరం ఎంత స్నేహితులూ, ప్రేమికులమైనా ఒకరి అభిప్రాయాలను మరొకరం గౌరవించుకుంటాం. ఇది మా బంధాన్ని మరింత బలపరిచింది. పెళ్లి తర్వాత తను బిజినెస్‌, నేను షూటింగ్స్‌లో బిజీగా ఉంటున్నాం. ఇంటికి ఒత్తిడితో తిరిగొచ్చే తను 'నీ నవ్వుకే నేను మెస్మరైజ్‌ అయిపోతానోయ్‌. ఇంతకు మించిన పాజిటివ్‌ వైబ్స్‌ ఏముంటాయి' అంటాడు. మా పెళ్లైన తర్వాత నన్ను ఇంకా ప్రేమగా చూసుకోవడం, మా రెండు కుటుంబాలపై మరింత శ్రద్ధ కనబరచడం ఇవన్నీ తనలో వచ్చిన పరిపక్వతగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రతి అంశాన్ని శ్రద్ధగా, బాధ్యతగా చూడటం అలవరుచుకున్నాడు.

భర్త గౌతమ్​తో కాజల్

ABOUT THE AUTHOR

...view details