దక్షిణాదిన వరుస సినిమాలతో బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్... తెలుగులో రణరంగం, తమిళంలో కోమలి సినిమాలతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే నటిగానే కాకుండా పెద్ద హీరోల సరసన ప్రత్యేక గీతాల్లోనూ కనువిందు చేస్తోన్న ఈ భామ.. పారితోషకమూ అంతేస్థాయిలో తీసుకుంటుందని టాక్. దాదాపు 2 కోట్ల వరకు ఆఫర్ చేస్తుందని సినీవర్గాల సమాచారం.
బాలీవుడ్లో తగ్గిందా...!
హిందీ పరిశ్రమలో అడుగుపెట్టాలని చూస్తోన్న కాజల్... జాన్ అబ్రహాం సరసన 'ముంబై సాగా'లో ఛాన్స్ కొట్టేసింది. అవకాశం వదులుకోకూడదని భావించిందో ఏమో కాని.. కాజల్ తన రెమ్యునరేషన్‌ని అమాంతం తగ్గించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. జాన్‌తో సినిమాలో నటించేందుకు తన సాధారణ పారితోషికంలో కేవలం నాలుగో వంతు కన్నా తక్కువకే(రూ.30 లక్షలు) కాజల్ ఒప్పేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకి సంజయ్ గుప్తా దర్శకుడు. ఇందులో ఇమ్రాన్ హష్మి, సునీల్ శెట్టి, జాకీష్రాఫ్, గుల్షన్ గ్రోవర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, అనురాధ గుప్తా నిర్మాతలు. వచ్చే ఏడాది జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.