కరోనా దెబ్బకు కుదేలైన చిత్రసీమ కార్మికులను ఆదుకునేందుకు కథానాయిక కాజల్ అగర్వాల్ ముందుకొచ్చింది. సినీ కార్మికుల సంక్షేమం కోసం చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'కరోనా క్రైసిస్ ఛారిటీ' (సిసిసి)కి రూ.2లక్షలు విరాళం అందిస్తున్నట్లు గురువారం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.
కాజల్ మంచి మనసు.. రూ.2 లక్షలు విరాళం - Kajal Agarwal donations for cinema industries\
కరోనా కారణంగా కష్టాలు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. కరోనా క్రైసిస్ ఛారిటీకి రూ.2 లక్షల విరాళం ప్రకటించింది.
కాజల్
ప్రస్తుతం కాజల్ తాను నివాసం ఉంటోన్న ముంబయిలోనూ పలు దాతృత్వ కార్యక్రమాలు చేస్తోంది. ఇటీవలే ధారావిలోని నాలుగు వందల కుటుంబాలకు పది రోజులకు సరిపడా నిత్యావసరాలు అందించింది.
ప్రస్తుతం ఈ భామ మంచు విష్ణుతో 'మోసగాళ్లు', కమల్‌హాసన్‌తో 'భారతీయుడు 2' చిత్రాల్లో నటిస్తోంది. త్వరలో చిరంజీవి సరసన 'ఆచార్య'లో సందడి చేయనుంది