కాజల్ బ్యూటీ, డైట్ సీక్రెట్ ఏంటో తెలుసా? - కాజల్ అగర్వాల్ ఫిట్నెస్ రహస్యం
ముప్పై ఆరేళ్లు వచ్చినా తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తోంది నటి కాజల్ అగర్వాల్. మరి ఆమె ఏం తింటూ తన అందాన్ని కాపాడుకుంటుందో తెలుసా?
కాజల్
ముప్పై ఆరేళ్లు వచ్చినా కూడా తొలిచిత్రంలోలానే అందాలొలుకుతూ ఉంటుంది కాజల్! అసలు తనేం తింటుందో అన్న సందేహానికి ఇలా చెప్పుకొచ్చింది.
- రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు, గంటన్నర రెండుగంటలకొకసారి చొప్పున ఏడు సార్లు డైట్ తీసుకుంటా.
- పూర్తిగా శాఖాహారిని కావడం వల్ల నా భోజనంలో తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, రోటీ, తేనె, గ్రీన్‌టీ వంటివే ఉంటాయి.
- ఉదయాన్నే వర్కవుట్ తర్వాత కొబ్బరినీళ్లు, చియా విత్తనాలు, స్ట్రాబెర్రీ వంటి వాటితో చేసిన స్మూతీ తింటా.
- అల్పాహారంలో బ్రౌన్ బ్రెడ్, ఓట్స్, పీనట్‌బటర్, సోయా ఉంటాయి.
- లంచ్‌లో గ్రీన్‌సలాడ్, పండ్లు, బ్రౌన్ రైస్, ఆకుకూరలు తప్పనిసరి.
- సాయంకాలం పండ్ల రసాలు, డిన్నర్‌లో వెజ్ సూప్, గ్రీన్‌సలాడ్ తీసుకుంటా.
- బయటి ఫుడ్‌కు ఆమడ దూరం. షూటింగ్‌కు వెళ్లినా అమ్మ చేతి వంటనే తింటా. ఎప్పుడైనా ఓరోజు నియమాలను పక్కన పెట్టేసి పిజ్జా, పరాటా, దోశ, ఇడ్లీ, బిరియానీ, చాక్లొట్‌కేక్ వంటివి లాగించేస్తా. మరుసటి రోజు ఓ అరగంట అదనంగా వ్యాయామాలు చేసి ఆ కొవ్వును కరిగించుకుంటా. పాల ఉత్పత్తులు, అన్నం, నిల్వ పదార్థాలు, జంక్‌ఫుడ్‌ని దగ్గరకు రానివ్వను.