తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'చందమామ' అందం కాజల్​కే​ సొంతం

ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్.. 36వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె గురించి విశేషాలు మీకోసం.

kajol agarwal
కాజల్​ అగర్వాల్​

By

Published : Jun 19, 2020, 5:40 AM IST

Updated : Jun 19, 2020, 6:06 AM IST

వన్నె తరగని అందం అంటారు కదా! ఈ మాట ముద్దుగుమ్మ కాజల్‌కు అక్షరాలా వర్తిస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి పదమూడేళ్లు అవుతున్నా... ఇప్పటికీ తన అందంతో మాయ చేస్తోంది. తనలో అందం మాత్రమే కాదు.. అంతకుమించిన అభినయమూ ఉందని కెరీర్​ ప్రారంభంలో చేసిన 'లక్ష్మీ కళ్యాణం', 'చందమామ' సినిమాలతో నిరూపించింది. అందుకే ఇప్పటికీ చిత్రసీమలో రాణిస్తోంది.

కాజల్​ అగర్వాల్​

పంజాబీ కుటుంబానికి చెందిన కాజల్​ తల్లిదండ్రులు వినయ్‌ అగర్వాల్, సుమన్‌ అగర్వాల్‌. 1985 జూన్‌ 19న ముంబయిలో జన్మించింది. అక్కడే మాస్‌ మీడియాలో డిగ్రీ చేసింది.‌ 'క్యూ హో గయా నా' చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. అప్పట్నుంచి సినిమాలపై మక్కువ పెంచుకొని, దక్షిణాదిలో అడుగుపెట్టి రాణించింది.

తెలుగులో 'లక్ష్మీకళ్యాణం'తో పరిచయమైంది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళంలో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దర్శకధీరుడు రాజమౌళి తీసిన 'మగధీర'తో స్టార్ హోదా సంపాదించింది. 'ఆర్య 2', 'డార్లింగ్‌', 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌', 'బృందావనం', 'తుపాకీ', 'గోవిందుడు అందరివాడేలే', 'ఎవడు', 'టెంపర్‌', 'బ్రహ్మోత్సవం' తదితర చిత్రాలు కాజల్‌కు మరింత పేరు తెచ్చిపెట్టాయి.

కాజల్​ అగర్వాల్​

కొంతకాలంగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలపై దృష్టిపెట్టిన కాజల్.‌. తన 50వ చిత్రంగా 'నేనే రాజు నేనే మంత్రి'తో పాటు 'అ!' సినిమాతో ప్రేక్షకుల్ని అలరించింది. 'జనతా గ్యారేజ్‌'తో ప్రత్యేక గీతాలకూ సై అంది.

కాజల్‌ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'ఆచార్య‌'లో నటిస్తోంది. మంచు విష్ణు 'మోసగాళ్ళు' చిత్రంలో హీరోయిన్​గా కనిపించనుంది. కమల్‌హాసన్‌తో 'భారతీయుడు2' చిత్రంలోను మెరవనుంది.

కాజల్​ అగర్వాల్​
కాజల్​ అగర్వాల్​

ఇది చూడండి : తెలుగు సినిమాల షూటింగ్​లపై అప్పట్లోనే ఆంక్షలు!

Last Updated : Jun 19, 2020, 6:06 AM IST

ABOUT THE AUTHOR

...view details