అదృష్టం వల్లే నేను స్టార్‌డమ్, గుర్తింపు తెచ్చుకున్నానని ఎవరైనా అంటే ఒప్పుకోనంటోంది టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. తన అందంతో కుర్రకారు మనసు దోచి.. నటనతో ప్రేక్షకులను మెప్పించిన కాజల్.. ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
"కృషి, దీక్ష, పట్టుదల లేకుండా వచ్చిన ఏ విజయమైనా ఆత్మసంతృప్తిని కలిగించదు. అందుకే ఎవరైనా అదృష్టం ఒక్కటే విజయానికి మార్గం అని చెబితే నమ్మొద్దు. నన్ను అప్పుడప్పుడూ అడుగుతుంటారు 'మీ సినీ కెరీర్‌లో అదృష్టం అనే పదానికి ఎంత విలువిస్తారని?'. నిజానికి నా జీవితంలోనూ ఆ పదానికి చోటుండి ఉండొచ్చు కానీ, నా స్టార్డమ్కు అదృష్టమే కారణమంటే అసలు ఒప్పుకోను. అవకాశం రావడం అదృష్టం వల్ల కావొచ్చేమో, ఆ తర్వాత నేను ఎదిగిన క్రమం అంతా నా కష్టమే."