తెరపై అందచందాలతో పాటు అభినయాన్ని చక్కగా ఒలికించే ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. 50కి పైగా సినిమాల్లో నటించిన ఈమె.. కొన్ని లిప్‌లాక్ సన్నివేశాలతోనూ మరిపించింది. కాజల్ ముద్దు పెట్టిన వారిలో తమిళ స్టార్ సూర్య ఒకరు. వీరిద్దరూ జంటగా చేసిన 'బ్రదర్స్'లో సినిమా థియేటర్ సీన్లో భాగంగా ముద్దుసీన్ ఉంటుంది. అయితే ఆ సన్నివేశానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెల్లడించిందీ భామ. నిజానికి ఆ సీన్లో సూర్యను కాజల్ ముద్దుపెట్టుకోలేదట. అది గ్రాఫిక్స్‌తో సృష్టించిన లిప్‌లాక్ అట.
అసలు నేను ముద్దు పెట్టలేదు: కాజల్
'బ్రదర్స్' సినిమాలోని లిప్‌లాప్ సన్నివేశం గురించి ఆసక్తికర విషయం చెప్పింది నటి కాజల్ అగర్వాల్. ఆ సీన్లో సూర్యను నిజంగా ముద్దు పెట్టుకోలేదని తెలిపింది.
"ఆ సీన్ చేసే సమయానికి సూర్యకు కానీ, నాకు కానీ అలా ముద్దుపెట్టుకోవాలని లేదు. ముఖ్యంగా సూర్య చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. కానీ ఆ సన్నివేశం చాలా ముఖ్యమైనది. అందుకే దర్శకుడు ఆనంద్ మా ఇద్దరి మధ్య గమ్మత్తైన పద్ధతిలో దానిని తీశారు. బ్లూ మ్యాట్ ముందు సూర్యను కుర్చీలో కూర్చోబెట్టి పక్కకు తిరిగి ఓ గ్లాస్‌పై ముద్దుపెట్టింది దాన్ని చిత్రీకరించారు. తర్వాత నా ఎదురుగా బ్లూమ్యాట్ తయారు చేసిన ఓ బొమ్మను పెట్టి దానికి ముద్దు పెట్టించారు. అలా మా రెండు సీన్లను గ్రాఫిక్స్‌లో ఒక్కటి చేసి లిప్‌లాక్‌లా చూపించారు. థియేటర్లో ఆ సీన్ చూసిన ప్రతిఒక్కరూ ఇది గ్రాఫిక్స్ అని చెప్తే నమ్మలేరు. అంత సహజంగా దానిని ఆవిష్కరించారు దర్శకుడు" -కాజల్ అగర్వాల్, కథానాయిక