స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. త్వరలో ఓ రీమేక్‌లో నటించనుందని టాక్. కొరియన్ చిత్రం 'డ్యాన్సింగ్ క్వీన్'ను తెలుగు ప్రేక్షకులకు చూపించేందుకు సురేశ్ ప్రొడక్షన్స్ సిద్ధమవుతోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం వచ్చింది.
కొరియన్ రీమేక్‌లో అప్పుడు సమంత.. ఇప్పుడు కాజల్! - entertainment news
ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్.. త్వరలో ఓ కొరియన్ రీమేక్‌లో నటించనుందని టాక్. ఇందులో అల్లరి నరేశ్ కీలక పాత్ర పోషించనున్నాడట.
![కొరియన్ రీమేక్‌లో అప్పుడు సమంత.. ఇప్పుడు కాజల్! కొరియన్ రీమేక్‌లో అప్పుడు సమంత.. ఇప్పుడు కాజల్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6348928-1081-6348928-1583746546930.jpg)
హీరోయిన్ కాజల్ అగర్వాల్
ఇందులోని ప్రధాన పాత్రకు కాజల్ అయితే న్యాయం చేయగలదని నిర్మాతలు భావిస్తున్నారట. ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపారని సమాచారం. ఇందులో అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడని టాక్.
గతంలో సమంత నటించిన 'ఓ బేబీ'.. 'మిస్ గ్రానీ' అనే కొరియన్ సినిమాకు రీమేక్. గతేడాది వచ్చిన ఆ చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. మరి పైవార్త నిజమైతే కాజల్ ఎలా అలరిస్తుందో చూడాలి.