తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఖైదీ' బాలీవుడ్​ రీమేక్​లో అజయ్​ దేవగణ్​ - కార్తి సమాచారం

'ఖైదీ' బాలీవుడ్​ రీమేక్​లో అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్​లో ప్రకటించాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

kaithi will going to remake in bollywood, leadrole play by ajay devgan
'ఖైదీ' బాలీవుడ్​ రీమేక్​లో అజయ్​ దేవగణ్​

By

Published : Feb 28, 2020, 4:43 PM IST

Updated : Mar 2, 2020, 9:07 PM IST

తెలుగు, తమిళ భాషల్లో గతేడాది విడుదలై, సూపర్​హిట్​గా నిలిచిన సినిమా 'ఖైదీ'. జైలు నుంచి విడుదలైన ఖైదీగా కార్తీ.. అద్భుత నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు. తక్కువ బడ్జెట్​తో రూపొందిన ఈ చిత్రాన్ని బాలీవుడ్​లోనూ రీమేక్​ చేయాలని ఎప్పుడో అనుకున్నారు. కానీ కథానాయకుడు ఎవరనే విషయాన్ని ఈరోజు(శుక్రవారం) ప్రకటించారు.

కార్తీ కనిపించిన పాత్రలో అజయ్ దేవగణ్ కనిపించనున్నాడు. మాతృకను తీసిన లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నాడు. రిలయన్స్ ఎంటర్​టైన్​మెంట్స్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఏడాది ఫిబ్రవరి 12న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చెప్పాడు అజయ్​​. తెలుగులో 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'తో పాటు హిందీలో 'భుజ్‌: ది ఫ్రైడ్‌ ఆఫ్‌ ఇండియా' సినిమాల్లో నటిస్తున్నాడీ నటుడు.

ఇదీ చూడండి..'ఖైదీ'తో తొలిసారి రూ.100 కోట్ల మార్క్!

Last Updated : Mar 2, 2020, 9:07 PM IST

ABOUT THE AUTHOR

...view details