నటుడు కైకాల సత్యనారాయణకు స్వల్ప అస్వస్థత
10:28 October 31
ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స
తెలుగు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఇంట్లో జారిపడిన ఆయనను.. నొప్పుల కారణంగా శనివారం రాత్రి ఆస్పత్రిలో చేర్చారు కుటుంబసభ్యులు. ప్రస్తుతం కైకాల.. సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉన్నారు. ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.
1959లో కైకాల నటించిన తొలి చిత్రం 'సిపాయి కూతురు' విడుదలైంది. అలా నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన.. 61 సంవత్సరాల పాటు అనేక పాత్రలు పోషించి నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇవీ చదవండి: