విభిన్న పాత్రలతో టాలీవుడ్, కోలీవుడ్లో పేరు తెచ్చుకున్నాడు హీరో కార్తీ. తాజాగా నటించిన చిత్రం 'ఖైదీ'. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో దిల్లీ అనే ఖైదీ పాత్రలో కనిపించాడు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు లోకేశ్ కనకరాజ్. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.
"ఖైదీ' చిత్రానికి మంచి విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ సినిమా తీర్చుదిద్దుతున్న క్రమంలోని ప్రతిక్షణం నాకెంతో ఇష్టం. అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నిర్మాత ప్రభుతో పాటు హీరో కార్తీకి ధన్యవాదాలు. సీక్వెల్ గురించి వస్తున్న మెసేజ్‌లు, ఫోన్‌లకు ఒకటే సమాధానం. 'దిల్లీ మళ్లీ రాబోతున్నాడు" -దర్శకుడు లోకేశ్ కనకరాజ్