తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కబీర్‌ సింగ్‌'తో సంబంధం లేదంటున్న కియారా..! - కొత్త సినిమా వార్తలు

'అర్జున్​ రెడ్డి' రీమేక్​గా హిందీలో తెరకెక్కిన చిత్రం 'కబీర్​సింగ్'.​ ఈ సినిమా విడుదలైనప్పుడు అనేక వివాదాలు చుట్టుముట్టాయి. ఇటీవల ఓ మీడియా సమావేశంలో ఈ చిత్ర​ కథానాయిక కియారా అడ్వాణి ఈ విషయాలపై స్పందించింది.

kabir singh heroin kaira advani comments on her movie
'సినిమాలో కేవలం పాత్రల్నే చూడండి'

By

Published : Dec 14, 2019, 4:18 PM IST

Updated : Dec 14, 2019, 4:40 PM IST

తెలుగులో విజయవంతమైన 'అర్జున్‌రెడ్డి' చిత్రాన్ని హిందీలో 'కబీర్‌ సింగ్‌'గా తెరకెక్కించారు. ఇందులో షాహిద్‌ కపూర్, కియారా అడ్వాణిలు నాయకానాయికలుగా నటించి మెప్పించారు. బాక్సాఫీస్ దగ్గర ఘనమైన వసూళ్లు సాధించిందీ సినిమా. అయితే హిందీలో 'కబీర్‌ సింగ్‌' తెరపైకి వచ్చినప్పుడు చాలా వివాదాలు చుట్టుముట్టాయి.

ఈ విషయంపై ఇటీవల ఓ ముఖాముఖి కార్యక్రమంలో కియారా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. సినిమాలు వేరు నిజ జీవితం వేరు. వాటి రెండింటిని ముడిపెట్టి చూడడం సరైనది కాదని చెబుతోందీ బాలీవుడ్‌ నటి.

"కబీర్‌ సింగ్‌ చిత్రంలో నేనొక నటిని మాత్రమే. అందులో నా పాత్ర ఏమీ ఉండదు. మనం సినిమాలోని పాత్రనే చూడాలి తప్ప.. మిగతా అంశాలను తప్పుపట్ట కూడదు. నాకు వ్యక్తిగతంగా ఏవో కొన్ని అభిప్రాయాలు ఉండవచ్చు. అలాగని సినిమాలో వచ్చే పాత్రల తీరుపై నేను తప్పు పట్టడం సరైంది కాదు. చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో నాకు అసౌకర్యంగానే అనిపించాయి. కానీ నేను పోషించేది నిజ జీవిత పాత్రను కాదు"

-కియారా అడ్వాణి, సినీ నటి

కియారా చివరకు వివాదస్పద అంశాల జోలికి వెళ్లకుండా తెలివిగా సమాధానం చెప్పిందని సినీ జనాలు అంటున్నారు. ప్రస్తుతం కియారా అడ్వాణి 'గుడ్‌ న్యూజ్‌' చిత్రంలో నటిస్తోంది. ఇందులో కరీనా కపూర్, అక్షయ్‌ కుమార్‌లు కూడా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: 'ఫేమస్​ లవర్' ​కోసం లవర్స్​డే వదిలేసిన చైతూ..!

Last Updated : Dec 14, 2019, 4:40 PM IST

ABOUT THE AUTHOR

...view details