బాలీవుడ్లో ఇటీవలే వచ్చిన 'కబీర్ సింగ్'.. బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. ఐదు రోజుల్లోనే 100 కోట్ల మార్క్‌ను అందుకుంది. హీరో షాహిద్ కపూర్ కెరీర్లో ఈ ఘనత సాధించిన తొలి చిత్రమిదే. సినిమాలోని అతడి బోల్డ్ నటన యువతరాన్ని థియేటర్ల వైపు రప్పిస్తోంది. కియారా అడ్వాణీ హీరోయిన్గా నటించింది.
షాహిద్ కపూర్ కెరీర్లో తొలిసారి ఇలా..! - ప్రీతిశెట్టి
షాహిద్ కపూర్ హీరోగా నటించిన 'కబీర్ సింగ్' 100 కోట్ల మార్క్‌ను అందుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తోందీ చిత్రం. షాహిద్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.
షాహిద్ కపూర్ కెరీర్లో తొలిసారి ఇలా..!
తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'అర్జున్ రెడ్డి'కు రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించారు. రెండింటికి దర్శకత్వం వహించింది సందీప్ రెడ్డి వంగా కావడం విశేషం. ఈ సినిమాపైనా కొన్ని వివాదాలు వచ్చినా.. కలెక్షన్పైనా అవేవి ప్రభావం చూపలేకపోతున్నాయి.
ఇది చదవండి: జెర్సీ సినిమా రీమేక్‌లో షాహిద్ కపూర్..?