తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అర్జున్​ రెడ్డి@కబీర్​ సింగ్​@200 కోట్లు - shahid kapoor

షాహిద్ కపూర్, కియారా అడ్వాణీ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'కబీర్ సింగ్'. జూన్ 1 విడుదలైన ఈ సినిమ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 200 కోట్ల మార్క్​ను దాటి దూసుకెళ్తోంది.

కబీర్ సింగ్

By

Published : Jul 4, 2019, 7:40 PM IST

తెలుగులో విజయవంతమైన చిత్రంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సినిమా అర్జున్ రెడ్డి. బాలీవుడ్​లో కబీర్​సింగ్ పేరుతో రీమేక్ అయింది. అక్కడా అదే రకమైన జోరుతో ఘనవిజయం సొంతం చేసుకుంది. మాతృకను తెరకెక్కించిన సందీప్‌ వంగానే హిందీ వెర్షన్‌కూ దర్శకత్వం వహించాడు.

షాహిద్‌ కపూర్‌ - కియారా అడ్వాణీ హీరోహీరోయిన్లుగా నటించారు. జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తొలిరోజు నుంచే మంచి టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తొలి వారంలో రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన ఈ సినిమా..తాజాగా రూ.200 కోట్ల మార్కును దాటేసింది. ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ తాజాగా ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా తెలియజేశారు.

తరణ్ ఆదర్శ్ ట్వీట్

భారత్‌లో బుధవారం నాటికి కబీర్‌సింగ్ రూ.206.48 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు వెల్లడించారు తరణ్ ఆదర్శ్. "‘కబీర్‌ సింగ్‌ 200 నాటౌట్‌’.. బాక్సాఫీస్‌ వద్ద డబుల్‌ సెంచరీ కొట్టాడు. కానీ, ఇంకా అలిసిపోయినట్లు కనిపించట్లేదు’" అని క్రికెట్‌ స్టైల్‌లో ఆసక్తికరమైన వ్యాఖ్యను జోడించారు. అంతేకాదు.. ఈ ఏడాది అత్యంత వేగంగా రెండొందల కోట్ల క్లబ్‌ను చేరుకున్న బాలీవుడ్‌ చిత్రమూ ఇదేనని తరణ్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ మార్క్‌ను చేరుకోవడానికి 'ఉరీ'కి 28 రోజులు, సల్మాన్‌ 'భారత్‌'కు 14 రోజులు సమయం పట్టగా.. 'కబీర్‌సింగ్' కేవలం 13 రోజుల్లోనే ఆ క్లబ్‌ను చేరుకోవడం విశేషం. ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రానికి దక్కుతున్న ఆదరణ చూస్తుంటే రూ.250 కోట్లు దాటే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ఇవీ చూడండి.. దూరం తరుగుతుంటే.. గారం పెరుగుతుంటే...

ABOUT THE AUTHOR

...view details