తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కబీర్ సింగ్' షాహిద్ కాకుంటే ఎవరు..? - kabirsingh

'అర్జున్ రెడ్డి' సినిమాకు రీమేక్​గా హిందీలో 'కబీర్ సింగ్' తెరకెక్కింది. షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. అయితే మొదట ఈ చిత్రంలో హీరో పాత్ర కోసం షాహిద్​తో పాటు మరో బాలీవుడ్ కథానాయకుడిని సంప్రదించాడట దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.

సందీప్

By

Published : Jun 4, 2019, 3:41 PM IST

Updated : Jun 4, 2019, 4:06 PM IST

'అర్జున్ రెడ్డి'.. టాలీవుడ్​లో ట్రెండ్ సెట్టర్ మూవీ. ఈ సినిమాతో హీరో విజయ్ దేవరకొండకు ఎంత ఫేమ్ వచ్చిందో తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం హిందీలో రీమేక్ అయింది. తెలుగులో దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా హిందీలోనూ దర్శకుడే. షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. అయితే మొదట ఈ సినిమాకు హీరోగా షాహిద్​తో పాటు మరో హీరోను సంప్రదించాడట దర్శకుడు.

తెలుగులోఈ సినిమాకు మొదట హీరోగా శర్వానంద్​ను అనుకున్నారంట. ఇంత బోల్డ్ కథాంశానికి తాను న్యాయం చేయలేనని శర్వా తప్పుకోగా ఆ అవకాశం విజయ్​ దేవరకొండను వరించింది. ప్రస్తుతం హిందీలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. 'అర్జున్ రెడ్డి' హిందీరీమేక్ 'కబీర్ సింగ్'​లో మొదట హీరోగా షాహిద్​తో పాటు అర్జున్ కపూర్​ను అనుకున్నాడట దర్శకుడు సందీప్. వీరిద్దరితో ఒకేసారి చర్చలు జరిపాడట. కానీ ఆ తర్వాత షాహిద్​నే ఫైనల్​ చేసి సినిమా పట్టాలెక్కించాడట దర్శకుడు.

షాహిద్​ ఈ పాత్రలో ఎంతో చక్కగా ఒదిగిపోయాడని దర్శకుడు సందీప్ చెప్పాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి.. వరుస సినిమాలతో రౌడీ హీరో జోరు

Last Updated : Jun 4, 2019, 4:06 PM IST

ABOUT THE AUTHOR

...view details