సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కబాలి'. ఈ సినిమా అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయినా.. రంజిత్ దర్శకత్వానికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అందుకే తలైవా అతనికి 'కాలా' సినిమాతో మరో అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం రంజిత్ 'ఇరండాం ఉలగపోరిన్ కడైసి గుండు' సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు.
ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రంజిత్ శిష్యుడు ఆదియన్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఈ సందర్భంగా సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది చిత్రబృందం. రజనీకాంత్‌తో సినిమా తీస్తానని కలలో కూడా అనుకోలేదని రంజిత్ తెలిపాడు.
"నేను దర్శకత్వం చేస్తానని, సినిమాలు నిర్మిస్తానని అసలు ఊహించలేదు. కళాశాల రోజుల్లో ఎదుర్కొన్న సమస్యలు, 'చిల్డ్రన్ ఆఫ్ హెవన్' వంటి సినిమాలే నేను ఇటు వైపు రావటానికి ప్రేరణగా నిలిచాయి. నేను చూసిన, పడిన బాధలు, నాకు భిన్న అనుభూతి కలిగించిన అనుభావాలను సినిమాలుగా రూపొందించాలనే నిర్ణయానికి వచ్చా. రజనీకాంత్ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని కలలో కూడా ఊహించలేదు. "