100కి పైగా సినిమాలు తీసి వాటితో బ్లాక్‌బస్టర్స్, హిట్లు కొట్టిన ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు(k raghavendra rao movies).. ఇన్నేళ్ల తర్వాత నటుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన 'పెళ్లి సందD'లో(pelli sandadi 2 release date) కీలకపాత్రలో నటించారు. అయితే ఈయన దాదాపు పదేళ్ల క్రితమే వెండితెరపై నటించాల్సింది కానీ అప్పుడు వచ్చిన అవకాశాన్ని వద్దనుకున్నారట. ఈ విషయం 'పెళ్లి సందD' ప్రీ రిలీజ్ ఈవెంట్లో బయటపడింది.
'శతమానం భవతి'(shatamanam bhavati movie songs) సినిమాలో తాత క్యారెక్టర్ కోసం తొలుత రాఘవేంద్రరావునే సంప్రదించారు నిర్మాత దిల్‌రాజు. కథ కూడా చెప్పారు. కానీ ఆయన నో చెప్పారు. దీంతో ఆ పాత్ర ప్రకాశ్‌రాజ్‌ను వరించింది. కుటుంబం నేపథ్య కథతో తీసిన ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది.