జ్యోతిక, శశికుమార్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన 'ఉడన్‌పిరప్పే'(udanpirappe movie release date) సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. అక్టోబర్ 14 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో(jyotika new movie on prime) స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. జ్యోతికకు ఇది 50వ సినిమా కావడం విశేషం. ఇందులో ధైర్యవంతురాలైన తంజావుర్ మహిళగా ఆమె సందడి చేయనుంది. తెలుగులో 'రక్తసంబంధం' పేరుతో ఈ మూవీ రానుంది. సూర్య 2డీ ఎంటర్‌టైన్మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శర్వణన్ దర్శకత్వం వహిస్తున్నారు. జాతీయ పురస్కారం అందుకున్న సంగీత దర్శకుడు డి ఇమ్మాన్ స్వరాలు సమకూర్చారు. గతేడాది 'పొన్‌మగళ్ వందాళ్'తో ఆకట్టుకుంది జ్యోతిక.
జ్యోతిక 50వ సినిమా.. 'ఎటాక్' రిలీజ్ డేట్ ఫిక్స్ - జ్యోతిక 50వ సినిమా రిలీజ్ డేట్
నటి జ్యోతిక 50వ సినిమా, బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం నటించిన 'ఎటాక్' చిత్రం రిలీజ్ డేట్లను ఖరారు చేసుకున్నాయి. ఎప్పుడంటే?
సినిమా అప్డేట్స్
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం(john abraham attack film) నటించిన 'ఎటాక్' సినిమా ఎట్టకేలకు విడుదల తేదీని ఖరారు చేసుకుంది(john abraham attack movie release date). కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిపబ్లిక్ డేన(జనవరి 26) రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొంది చిత్రబృందం. ఈ యాక్షన్ మూవీని లక్ష్యరాజ్ ఆనంద్ తెరకెక్కించారు. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక.
ఇదీ చూడండి: అఖిల్ సినిమా ట్రైలర్.. సాంగ్స్‌తో 'మహాసముద్రం', 'కొండపొలం'
Last Updated : Sep 30, 2021, 10:37 PM IST