కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, జ్యోతిక(suriya jyothika movies) దంపతులు మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. తమిళనాడుకు చెందిన ఇరులర్ ట్రైబ్(ఆదివాసీల) సంక్షేమం కోసం రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు. తమిళనాడు సీఎం స్టాలిన్(cm stalin helpline number) సమక్షంలో చెక్‌ను హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చంద్రూ, పాజ్హన్కుడి ఇరులర్ ట్రస్ట్‌కు అందజేశారు. అంతకముందు కరోనా సమయంలోనూ తమ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఈ దంపతులు విరాళం ఇచ్చారు.
సూర్య నటించిన కొత్త చిత్రం 'జై భీమ్'(jai bhim release date).. నవంబరు 2నుంచి తమిళం, తెలుగు, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో(amazon prime movies) స్ట్రీమింగ్ కానుంది. జ్ఞానవేల్ దర్శకుడు. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఓ కోర్టు డ్రామా కథాంశంతో ఈ చిత్రం రూపొందించారు. ఏ తప్పు చేయని బలహీన వర్గ(ఆదివాసి) మహిళను కేసు నుంచి బయటపడేసే లాయర్ పాత్రలో సూర్య కనిపించనున్నారు.