తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సలార్​'లో ప్రభాస్ అక్కగా తమిళ స్టార్ నటి! - ప్రభాస్ శ్రుతిహాసన్ సలార్

ప్రభాస్, శ్రుతిహాసన్​ జంటగా నటిస్తున్న 'సలార్' సినిమాకు సంబంధించిన ఓ వార్త అభిమానులకు ఆసక్తి కలిగిస్తోంది. ఇందులో ప్రభాస్ సోదరిగా తమిళ ప్రముఖ నటి కనిపించనున్నట్లు తెలుస్తోంది.

jyothika seen as prabhas sister in salaar?
ప్రభాస్

By

Published : May 22, 2021, 4:10 PM IST

డార్లింగ్ ప్రభాస్ హీరోగా, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్​ తెరకెక్కిస్తున్న 'సలార్' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్​లో జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం గురించి రోజుకో వార్త వస్తూనే ఉంది. ఇప్పుడు కూడా ఓ ఆసక్తికర విషయం చర్చనీయాంశమవుతోంది.

జ్యోతిక-ప్రభాస్

ఇందులో ప్రభాస్​ అక్కగా తమిళ నటి జ్యోతిక నటించనుందని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం చర్చల దశలోనే ఉందని, త్వరలో స్పష్టత రానుందని టాక్. ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్​గా చేస్తోంది. మరోవైపు 'సలార్​'లో ప్రభాస్​ ద్విపాత్రాభినయం కూడా చేయనున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అభిమానులు అనుకుంటున్న పలు విషయాలపై క్లారిటీ రావాలంటే మరికొద్దిరోజులు ఎదురుచూడాల్సిందే.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details