నిజ జీవితంలో జ్యోతిక, కార్తి.. వదినా-మరిది అవుతారు. తెరపై మాత్రం ఒకే తల్లికి పుట్టిన బిడ్దలుగా కనిపించబోతున్నారు. జీతూజోసెఫ్ దర్శకత్వంలో వీరిద్దరూ ఓ సినిమా చేసేందుకు అంగీకరించారు. తమిళం, మలయాళ భాషల్లో ఆ చిత్రం రూపొందనుంది. తెలుగులోనూ విడుదలయ్యే అవకాశాలున్నాయి.
ఈ డైరక్టర్ ఇంతకు ముందు 'పాపనాశనం'(దృశ్యం సినిమా మాతృక) అనే చిత్రాన్ని తెరకెక్కించాడు . అది పలు భాషల్లో రీమేకై అన్ని చోట్ల ఘనవిజయం సాధించింది.