తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కార్తీకి జ్యోతిక వదిన కాదు.. అక్క! - jyothika act as a karthi sister

తమిళ హీరో కార్తీ.. తన వదిన జ్యోతికతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో ఆమె కార్తీకి అక్కగా నటించనుంది. తొలిసారిగా జ్యోతికతో కలిసి పనిచేస్తున్న కార్తీ... ఆమె నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నాని చెబుతున్నాడు.

కార్తీ - జ్యోతిక

By

Published : Nov 3, 2019, 6:15 PM IST

'ఖైదీ' సినిమాతో బంపర్ హిట్ అందుకున్న కార్తీ... అదే జోరులో మరో సినిమా ప్రారంభించాడు. ఇందులో జ్యోతిక కీలక పాత్ర పోషించనుంది. తొలిసారి తన వదినతో నటిస్తుండటం ఆనందంగా ఉందన్న కార్తీ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఈ సినిమాలో జ్యోతిక తనకు అక్క పాత్ర పోషించనుందని తెలిపాడు.

"సెట్​కు వచ్చే వరకే ఆమె నాకు వదిన. ఒక్కసారి షూటింగ్​కు వచ్చాక అక్కడ మేము నటీనటులగానే ఉంటాం. కెమెరా ముందు ఇద్దరికీ పాత్రలు మాత్రమే గుర్తుకు వస్తాయి. వదిన నా కంటే చాలా సీనియర్. సినిమాకు సంబంధించిన చాలా విషయాలు ఆమె నుంచి నేర్చుకుంటున్నా".

- కార్తీ, సినీ హీరో.

ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. తమిళంలో దృశ్యం సినిమాను తెరకెక్కించిన జీతు జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నాడు. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కాకుండా మణిరత్నంతో మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పేశాడు కార్తీ.

ఇదీ చదవండి: సాహో తర్వాత సందిగ్ధంలో ప్రభాస్..!

ABOUT THE AUTHOR

...view details