తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లైంగిక ఆరోపణలు అవాస్తవం: బీబర్​ - జస్టిన్​ బీబర్​ లైంగిక ఆరోపణలు

ప్రముఖ పాప్​ సింగర్​ జస్టిన్​ బీబర్​ తన​పై వచ్చిన లైంగిక ఆరోపణలను తీవ్రంగా ఖండించాడు. ఆ మహిళ చెబుతున్న సమయానికి తాను ఆ ప్రదేశంలో లేనని.. పూర్తి సాక్ష్యాలతో ట్విట్టలో పోస్ట్​ చేశాడు.

Justin Bieber denies sexual assault allegations, seeks legal actions
లైంగిక ఆరోపణలు అవాస్తవం.. సాక్ష్యాలు ఇవే:జస్టిన్​ బీబర్​

By

Published : Jun 22, 2020, 4:11 PM IST

ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తనపై వచ్చిన ఆరోపణలను ప్రముఖ అమెరికన్​ పాప్​ సింగర్​ జస్టిన్​ బీబర్​ కొట్టిపారేశాడు. మహిళ చెబుతున్న సమయానికి తాను ఆ ప్రదేశంలో లేనని స్పష్టం చేశాడు. ఇందుకు సంబంధించిన పూర్తి సాక్ష్యాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. పుకార్లు ఎప్పటికీ పుకార్లేనని.. అయితే, ఇటువంటి ఆరోపణలను తేలికగా తీసుకోకూడదని బీబర్​ తెలిపాడు.

"నా కెరీర్​లో ఇటువంటి ఆరోపణలు ఎన్నో వచ్చాయి. కాబట్టి, సాధారణంగా నేను ఇటువంటి విషయాలకు స్పందించను. కానీ నా భార్య, బృందంతో మాట్లాడిన తర్వాత ఈ సమస్యపై మాట్లాడాలని నిర్ణయించుకున్నా. అయితే, దీని గురించి నేను ఏదైనా చెప్పే ముందు వాస్తవాలను సేకరించాలని అనుకున్నా."

-జస్టిన్​ బీబర్​, అమెరికన్​ సింగర్​

మహిళ చెబుతున్న సమయానికి తాను ఆస్టిన్​లో ఎస్​ఎక్స్​ఎస్​డబ్ల్యూ షోలో పాల్గొని పాటలు పాడినట్లు బీబర్​ తెలిపాడు. వాషింగ్టన్​ సింగర్​ సెలెనా గోమెజ్​తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైనట్లు స్పష్టం చేస్తూ.. అందుకు సంబంధించిన న్యూస్​ ఆర్టికల్స్​, సోషల్​ మీడియా పోస్టులు, ఈమెయిల్​ స్క్రీన్​షాట్లు తదితర సాక్ష్యాలను ట్విట్టర్​లో పంచుకున్నాడు.

"2014 మార్చి 9న ఆస్టిన్​ టెక్సాస్​లోని ఫోర్ సీజన్​ హోటల్​లో నేను లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ట్విట్టర్​లో కనిపించింది. నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. ఈ ఆరోపణల్లో నిజం లేదు.. వాస్తవానికి మహిళ చెబుతున్న సమయానికి నేను ఆ ప్రదేశంలో లేను. అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఇవే."

-జస్టిన్​ బీబర్​, అమెరికన్​ సింగర్​

బీబర్​ వరుస ట్వీట్లకు స్పందించిన మైక్రోబ్లాగింగ్​ సంస్థ.. వెంటనే డేనియల్​ చేసిన పోస్టును తొలగించింది. ఇటువంటి ఆరోపణలను తీవ్రంగా పరిగణించాలని.. వెంటనే ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు బీబర్​ వెల్లడించాడు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details