తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సూర్య కొత్త సినిమాకు అప్పుడే చిక్కులు - సూర్య తెలుగు సినిమా

సూర్య కొత్త సినిమాకు షూటింగ్ ప్రారంభించక ముందే చిక్కులు మొదలయ్యాయి. ఈ చిత్ర కథ తన దగ్గరున్న కథను పోలి ఉందంటూ పూవి అనే వ్యక్తి మీడియా ముందుకొచ్చాడు. ఈ విషయంపై చిత్రబృందం ఇప్పటివరకు స్పందించలేదు.

just before the surya's new project could have started, problems have begun
సూర్య కొత్త సినిమాకు అప్పుడే చిక్కులు

By

Published : Jan 21, 2020, 4:30 PM IST

Updated : Feb 17, 2020, 9:12 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. కొన్నేళ్లుగా తెలుగులో ఆదరణ పొందలేకపోతున్నాడు. ఇటీవల కాలంలో వచ్చిన 'ఎన్​జీకే', 'బందోబస్తు' చిత్రాలు టాలీవుడ్​లో బోల్తా కొట్టాయి. ఈ నేపథ్యంలో ఆచితూచి అడుగులేస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో 'ఆకాశం నీ హద్దురా' అనే బయోపిక్​లో నటిస్తున్నాడు. వెట్రిమారన్ దర్శకత్వంలోనూ నటించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు కాకముందే చిక్కులు వచ్చిపడ్డాయి.

స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్​తో 'వాడి వాసల్' అనే సినిమా చేస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం సూర్య ప్రకటించాడు. సీఎస్ చెల్లయ్య రచించిన ఓ నవల ఆధారంగా, జల్లికట్టు ప్రధానాంశంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే సంబంధిత హక్కులను కొనుగోలు చేశారు. కలైపులి ఎస్.థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

అయితే ఈ సినిమా కథను పోలి ఉన్న కథను ఐదేళ్ల క్రితమే సూర్యకు చెప్పానని పూవి అనే రచయిత మీడియా ముందుకొచ్చాడు. అప్పుడు కొన్ని మార్పులు సూచించిన ఆయన, తర్వాత చేస్తానన్నారని తెలిపాడు. కానీ ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదని వెల్లడించాడు. ఇప్పుడు 'వాడి వాసల్' ప్రకటన చూసి షాక్​కు గురయ్యానని అన్నాడు. ఇప్పటివరకు దీనిపై చిత్రబృందం స్పందించలేదు.

ఇదీ చదవండి: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ మరోసారి ఎన్టీఆర్​తో!

Last Updated : Feb 17, 2020, 9:12 PM IST

ABOUT THE AUTHOR

...view details