తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వ్యక్తుల ప్రాధాన్యత బట్టి పాత్రలు ఇవ్వను'

సినిమాలో పాత్రల ప్రాధాన్యత.. తెలిసిన వారికి ఇచ్చేది కాదని.. ప్రముఖ దర్శకుడు మురుగదాస్​ అన్నాడు. 'గజని'లో నయనతార పాత్ర నిడివి కావాలనే తక్కువ చేశారనే విషయమై మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశాడు.

Just because i dislike a character I can not reduce a role says AR Murugadoss
'వ్యక్తుల ప్రాధాన్యత బట్టి పాత్రలు ఇవ్వను'

By

Published : Dec 31, 2019, 7:48 PM IST

తన వ్యక్తిగత అభిప్రాయాల అనుగుణంగా కథలో మార్పులు చేయనని దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌ అన్నాడు. ఈ డైరెక్టర్​ తీసిన 'గజిని'(2005)లో సూర్య, అసిన్‌ జంటగా నటించారు. నయనతార కీలక పాత్రలో కనిపించారు. ఇందులో తన పాత్ర పట్ల నయన్‌.. గతంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. తన పాత్ర నిడివి చాలా తక్కువే ఇందుకు కారణమంది.

"గజిని'లో పాత్ర​కు సంతకం చేయడం.. నేను తీసుకున్న అతి చెత్త నిర్ణయం. కథలో చెప్పిన విధంగా తెరపై నా రోల్​ను తీర్చిదిద్దలేదు. నా ఫొటోగ్రాఫ్‌ కూడా బాగా తీయలేదు. ఈ విషయంలో నేను ఎవరిపై ఫిర్యాదు చేయడం లేదు.. ఇది నాకు అనుభవం నేర్పింది" -నయనతార, నటి

అయితే ఈ చిత్రం వచ్చిన 14 ఏళ్ల తర్వాత.. నయన్‌ వ్యాఖ్యలపై మురుగదాస్‌ స్పందించారు.

"ఓ వ్యక్తి లేదా పాత్ర నాకు నచ్చింది, నచ్చలేదన్న కారణంతో.. వారి పాత్ర నిడివిని పెంచను, తగ్గించను. కొన్ని సార్లు నచ్చని వారికీ మంచి పాత్రలు ఇస్తుంటాం. అదేవిధంగా మా అభిమాన నటీనటులకు చిన్న పాత్రలు ఇవ్వాల్సి వస్తుంది. అది మా చేతుల్లో లేదు"
- మురుగదాస్​, దర్శకుడు

ప్రస్తుతం ఏ.ఆర్‌.మురుగదాస్‌, నయనతార కలిసి పనిచేసిన సినిమా 'దర్బార్‌'. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇదీ చదవండి:-విజయ్ 'మాస్టర్'.. పోస్టర్​తో అదరగొట్టేశాడు

ABOUT THE AUTHOR

...view details