కేటీ పెర్రీ.. ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులైన అమెరికన్ గాయని. పాప్ సాంగ్స్‌తో కుర్రకారును ఉర్రూతలూగించే ఈ సింగర్ కాపీ క్యాట్ అని తేల్చింది కోర్టు. 2013లో ఆమె రూపొందించిన 'డార్క్‌హార్స్' ఆల్బమ్‌లోని కొన్ని మ్యూజిక్ బీట్స్‌ను జాయ్‌ఫుల్ నాయిస్ అనే క్రిస్టియన్ ర్యాప్ సాంగ్ నుంచి పాక్షికంగా వాడారని తీర్పు చెప్పింది ఫెడరల్ జ్యూరీ. కేసులో జరిమానా ఎంత కట్టాలనేది న్యాయస్థానం ఇంకా నిర్ణయించలేదు.
5 ఏళ్ల నుంచి నడుస్తున్న ఈ కేసులో అనేక వాద ప్రతివాదనల తర్వాత సోమవారం తీర్పు చెప్పింది జ్యూరీ. 9 మంది సభ్యులతో కూడిన న్యాయస్థానం రెండు పాటలను విన్న అనంతరం తుదితీర్పు వెల్లడించింది.