విశ్వవిఖ్యాత, నటసౌర్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఆయన్ని స్మరించుకున్నారు. సామాజిక మాధ్మమాల్లో భావోద్వేగ పోస్టుతో నివాళులు అర్పించారు.
NTR jayanthi: మా గుండెల్ని మరొక్కసారి తాకిపో తాతా!
నట సౌర్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి (ntr jayanthi) సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు జూనియర్ ఎన్టీఆర్. భావోద్వేగ సందేశాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేశారు.
ఎన్టీఆర్
"మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా. సదా మీ ప్రేమకు బానిసను" అంటూ ఓ సందేశాన్ని షేర్ చేశారు తారక్.
ఇప్పటికే బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించగా.. చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కోరారు. కల్యాణ్ రామ్, నారా రోహిత్ తదితరులు రామారావుకు నివాళులు అర్పిస్తూ ట్వీట్లు చేశారు.