తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తారక్ అతిథిగా 'ఎంత మంచివాడవురా' ప్రీ రిలీజ్ ఈవెంట్ - కల్యాణ్​రామ్

నందమూరి కల్యాణ్​రామ్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఎంత మంచివాడవురా'. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా తారక్​ హాజరుకానున్నాడు.

junior NTR
తారక్

By

Published : Jan 5, 2020, 12:11 PM IST

నందమూరి హీరో కల్యాణ్​రామ్​ నటించిన 'ఎంత మంచివాడవురా' ముందస్తు విడుదల వేడుక.. ఈనెల 8న జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోదరుడు జూనియర్ ఎన్టీఆర్‌ హాజరవ్వనున్నాడు. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన చేసింది చిత్రబృందం.

తారక్ అతిథిగా 'ఎంత మంచివాడవురా' ప్రీ రిలీజ్ ఈవెంట్

కల్యాణ్ రామ్​-సతీశ్ వేగేశ్న కాంబినేషన్​లో 'ఎంత మంచివాడవురా' రూపొందింది. మెహరీన్‌ హీరోయిన్. గోపీసుందర్​ సంగీతమందించాడు. ఉమేశ్ గుప్తా, సుభాశ్ గుప్తాలు సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి.. తండ్రిగా ప్రమోషన్​ పొందిన అనిల్ రావిపూడి

ABOUT THE AUTHOR

...view details