తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'జడ్జిమెంట్'​ జర్నలిస్ట్​ వైపే... బాయ్​కాట్ కొనసాగింపు - kangana ranaut

'జడ్జిమెంటల్ హై క్యా' సినిమా పాటల విడుదల కార్యక్రమంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్​.. ఓ విలేకరిపై మండిపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీరియస్​ అయిన మీడియా అసోసియేషన్​... క్వీన్​ను​ క్షమాపణ చెప్పాలని కోరింది. అయితే ఆ చిత్ర నిర్మాతలు సారీ చెప్పినా జర్నలిస్టుల సంఘం అంగీకరించలేదు. ఫలితంగా కంగనా సినిమాపై బాయ్​కాట్​ కొనసాగుతోంది.

'జడ్జిమెంట్'​ జర్నలిస్ట్​ వైపే

By

Published : Jul 10, 2019, 7:19 PM IST

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ నటించిన చిత్రం 'జడ్జిమెంటల్ హై క్యా'. ఎన్నో వివాదాల తర్వాత పేరు మార్చుకొని విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో కంగనా వాఖ్యలు గందరగోళం రేపాయి. ఓ మీడియా ప్రతినిధిపై అందరిలోనూ మండిపడిన వీడియో నెట్టింట వైరల్​గా మారింది. క్వీన్​ వ్యాఖ్యలకు సీరియస్​ అయిన 'ఎంటర్‌టైన్‌మెంట్‌ జర్నలిస్ట్స్​ గిల్డ్ ఆఫ్ ఇండియా' ఆమెను సారీ చెప్పాలని డిమాండ్ చేసింది. కంగన క్షమాపణ చెప్పకుండా నిర్మాతల చేత చెప్పించడం జర్నలిస్ట్​ల సంఘానికి మరింత ఆగ్రహం తెప్పించింది. ఫలితంగా కంగనా సినిమా ప్రచారం చేయబోమని నిషేధం ప్రకటించింది గిల్డ్​.

మీడియా అసోసియేషన్ నోట్​

ఏం జరిగింది...?

కంగనా రనౌత్​ నటించిన 'జడ్జిమెంటల్ హై క్యా' సినిమా పాటల విడుదల కార్యక్రమం ముంబయిలో జరిగింది. ఆ వేడుకలో ఓ జర్నలిస్టుపై కంగన తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆయన ‘మణికర్ణిక’ సినిమాకు తక్కువ రేటింగ్‌ ఇచ్చారని, మూవీ వ్యతిరేకంగా రివ్యూ రాశాడని సమావేశంలో మండిపడింది.

" నేను తీసిన 'మణికర్ణిక' సినిమాకు నువ్వు నెగిటివ్ రివ్యూస్​ ఇచ్చావు. సినిమా తీయడంలో నేనేమైనా తప్పు చేశానా. నువ్వు నా క్యార్​ వాన్​లో నన్ను వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేశావు.. ఆ తర్వాత నా మొబైల్​కు మెసేజ్​ చేశావు" అంటూ కంగనా విలేకరిపై ఆరోపణలు చేసింది. తాను అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదంటూ విలేకరి కంగనాను ప్రశ్నించగా ఈ గొడవ ప్రారంభమైంది. కార్యక్రమంలో​ కాసేపు గందరగోళం నెలకొంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఘటనపై ఫైర్​ అయిన 'ఎంటర్‌టైన్‌మెంట్‌ జర్నలిస్ట్స్‌ గిల్డ్ ఆఫ్ ఇండియా' కంగన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో కంగనను బహిష్కరిస్తామని, ఆమెకు సంబంధించి ఎటువంటి ప్రచారం చేయమని పేర్కొంది.

మీడియా ప్రతినిధిపై కంగనా ఫైర్​

ఫలితంగా కాస్త తగ్గిన 'జడ్జ్‌మెంటల్‌ హై క్యా' నిర్మాణ సంస్థ బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సంఘటనపై క్షమాపణలు కోరుతున్నామని పేర్కొంది. ఇతరుల మనోభావాల్ని దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని తెలిపింది. తమ సినిమా 'జడ్జ్‌మెంటల్‌ హై క్యా' జులై 26న విడుదల కానుందని.. మీడియా ఈ సంఘటనను మర్చిపోయి ఎప్పటిలాగే సహకరించాలని కోరింది. అయితే హీరోయిన్​ సారీ చెప్పాల్సి ఉండగా నిర్మాతలే ముందుకు రావడం మీడియా సంఘానికి కోపాన్ని తెప్పించింది.

మరోపక్క కంగన క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ఆమె సోదరి రంగోలి ట్వీట్‌ చేసింది.

" కంగన సారీ చెప్పదు. ఆమెను క్షమాపణలు చెప్పమని అడిగే అర్హత మీకు లేదు. మీలాంటి దేశ ద్రోహుల్ని, తప్పుడు వ్యక్తుల్ని కంగన సరైన మార్గంలో పెడుతుంది" అని పోస్ట్‌ చేసింది రంగోలి. అయితే కంగన, రంగోలి తీరును నెటిజన్లు తప్పుపట్టారు. ఇలా ప్రవర్తించడం సరికాదని మందలించారు.

ABOUT THE AUTHOR

...view details