రంగుల పండగ హోలీ సందర్భంగా 'యంగ్ టైగర్' ఎన్టీఆర్ తన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. మంగళవారం కుటుంబసభ్యులతో కలిసి ఈ హీరో హోలీ పండగ జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా సతీమణి ప్రణతితో పాటు ఇద్దరు కుమారులు అభయ్‌రామ్, భార్గవ్‌రామ్‌లతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతోంది. చాలా రోజుల తర్వాత తమ అభిమాన కథానాయకుడు తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన కారణంగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
అభిమానులకు ఎన్టీఆర్ హోలీ గిఫ్ట్ - rrr movie
హోలీ పర్వదినం సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి హోలీ జరుపుకొని.. ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.
ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్‌ఆర్‌ఆర్'లో నటిస్తున్నాడు. ఇందులో అతడు కొమురం భీం పాత్రలో దర్శనమివ్వనున్నాడు. మరో కథానాయకుడు రామ్‌చరణ్.. అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నాడు. చెర్రీ సరసన ఆలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్‌కు జోడీగా ఓలివియా మోరిస్ కనిపించనుంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెలలో ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. చరణ్ పుట్టినరోజు సందర్భంగా అతడి లుక్ లేదా, టైటిల్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నాడు.