యంగ్‌టైగర్ ఎన్టీఆర్ మరోసారి అభిమానుల పట్ల మంచి మనసు చాటుకున్నారు. కండరాల బలహీనతతో బాధపడుతూ తీవ్ర అనారోగ్యానికి గురైన వెంకన్న అనే అభిమానికి వీడియో కాల్ చేసి మాట్లాడారు. సెల్ఫీ దిగాలనే వెంకన్న కోరికను పరిస్థితులు కుదుటపడ్డాక నెరవేర్చనున్నట్లు తారక్ హామీ ఇచ్చారు.
అభిమాని కుటుంబానికి అండగా తారక్ - ఎన్టీఆర్ వార్తలు
టాలీవుడ్ అగ్రకథానాయకుడు ఎన్టీఆర్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. కండరాల బలహీనతతో బాధపడుతున్న అభిమాని వెంకన్నతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. పరిస్థితులన్నీ కుదుటపడ్డాక తనతో కలిసి సెల్ఫీ దిగుతానని తారక్ హామీ ఇచ్చారు.
అభిమాని కుటుంబానికి అండగా ఉంటానన్న తారక్
వెంకన్నతో దాదాపు రెండు నిమిషాల పాటు మాట్లాడి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎన్టీఆర్.. ఆ కుటుంబానికి తనవంతు సహాయాన్ని అందించనున్నట్లు తెలిపారు. ఆనందమే ఆయుష్షు పెంచుతుందంటూ వెంకన్నలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఎన్టీఆర్ వీడియో కాల్ చేసి మాట్లాడటం పట్ల వెంకన్న కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.