తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్ పులితో ఫైట్.. వీడియో లీక్ - tollywood leaked videos

'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఎన్టీఆర్​కు సంబంధించిన ఓ ఫైట్​ సీన్​ లీకైంది. ఇందులో పులితో పోరాటం చేస్తూ కనిపించాడీ హీరో.

'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్ పులితో ఫైట్.. వీడియో లీక్
రాజమౌళి-ఎన్టీఆర్

By

Published : Jan 25, 2020, 8:39 AM IST

Updated : Feb 18, 2020, 8:13 AM IST

దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న 'ఆర్​ఆర్ఆర్​' సినిమాకు లీకుల బాధ తప్పడం లేదు. ఇంతకు ముందు ఓ సారి షూటింగ్​లో ఎన్టీఆర్​ లుక్స్​ బయటకు రాగా, ఇప్పుడు ఏకంగా తారక్​పై తీస్తున్న ఓ ఫైట్ సీన్​కు సంబంధించిన​ వీడియోనే లీకైంది.

జూనియర్ ఎన్టీఆర్-పులి

అడవి పులి, కొమరం భీమ్​ పాత్రల మధ్య జరిగే భీకర పోరాటాన్ని, ఇటీవలే ఎంతో ప్రయాసతో చిత్రీకరించారు. ఇప్పుడు ఆ వీడియో కాస్త లీకవడం వల్ల చిత్ర యూనిట్ అప్రమత్తమైంది. ఆన్​లైన్​ నుంచి ఆ విజువల్​ను తొలగించింది. అయితే నెటిజన్లు మాత్రం.. అందులో ఎన్టీఆర్ లుక్​ బాగుందని కామెంట్లు పెడుతున్నారు.

ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్​ దేవగణ్, సముద్రఖని, అలీసన్ డూడీ, రే స్టీవెన్​సన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నాడు. సినిమాను ఈ ఏడాది జూలైలో కాకుండా అక్టోబరులో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి వాటిలో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

హీరో రామ్​చరణ్​తో జూనియర్ ఎన్టీఆర్
Last Updated : Feb 18, 2020, 8:13 AM IST

ABOUT THE AUTHOR

...view details