Jr NTR Akhanda: బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ'.. బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. బాలయ్య నటనకు, యాక్షన్‌కు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. వారి ఈలలు, గోలలతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఈ క్రమంలోనే సినిమాపై స్పందించారు యంగ్‌టైగర్ ఎన్టీఆర్. అఖండ విజయాన్ని అందుకున్న బాలయ్యకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
"'అఖండ' చూశాను. దద్దరిల్లే విజయాన్ని అందుకున్న బాల బాబాయికి, చిత్ర బృందానికి కంగ్రాట్స్. అభిమానులను అలరించే సన్నివేశాలు సినిమాలో ఎన్నో ఉన్నాయి."