తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బాలీవుడ్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా' - ఎన్టీఆర్​ సినిమా వార్తలు

Jr NTR Bollywood: టాలీవుడ్​ స్టార్​ హీరో ఎన్టీఆర్​​ తన బాలీవుడ్​ ఎంట్రీపై ఆసక్తికర విషయం చెప్పారు. తాను బాలీవుడ్‌ సినిమా అవకాశాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం విడుదలైన తర్వాత పరిస్థితులు మారి అవకాశాలు రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

ntr
బాలీవుడ్​ ఎంట్రీ కోసం ఎన్​టీఆర్​ వేయిటింగ్​?

By

Published : Dec 22, 2021, 12:27 PM IST

Jr NTR Bollywood: రామ్‌చరణ్‌-ఎన్టీఆర్‌ కథానాయకులుగా నటించిన మల్టీస్టారర్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ పాన్‌ ఇండియా చిత్రం జనవరి 7న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది. హిందీ వెర్షన్‌ కోసం ఇటీవల ముంబయిలో ప్రి-రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించింది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ పలు మీడియా సమావేశాల్లో పాల్గొంటూ విలేకర్ల ప్రశ్నలకు జవాబులిస్తున్నారు. ఈ క్రమంలో తన బాలీవుడ్‌ ఎంట్రీపై ఎన్టీఆర్‌ ఆసక్తికరమైన విషయం చెప్పారు.

ఓ విలేకరి.. నేరుగా హిందీ సినిమాలో ఎప్పుడు నటిస్తారు? అని ప్రశ్నించగా.. తాను బాలీవుడ్‌ సినిమా అవకాశాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం విడుదలైన తర్వాత పరిస్థితులు మారి అవకాశాలు రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాంటి సందర్భం కోసం తాను ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

అయితే, 'ఆర్‌ఆర్‌ఆర్‌'లోని మరో నటుడు రామ్‌ చరణ్‌ ఎనిమిదేళ్ల కిందటే 'జంజీర్‌' చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. కానీ, ఆ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌, అజయ్‌దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని, రేయ్‌ స్టీవ్‌సన్‌, ఎలిసన్‌ డ్యూడీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈచిత్రాన్ని నిర్మించారు.

ఇదీ చూడండి :'సెకండ్‌ హ్యాండ్‌ ఐటెమ్‌'.. ట్రోల్‌పై స్పందించిన సమంత

ABOUT THE AUTHOR

...view details