మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరోసారి ఎన్టీఆర్తో! - ఎన్టీఆర్, త్రివిక్రమ్ రెండో సినిమా
ఇటీవలే 'అల వైకుంఠపురములో'తో మరోసారి స్టామినా చూపించాడు దర్శకుడు త్రివిక్రమ్. ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్టు జూనియర్ ఎన్టీఆర్తో చేయనున్నాడని టాక్.
మరోసారి ఎన్టీఆర్తో త్రివిక్రమ్
'అల వైకుంఠపురములో' చిత్రంతో మరో భారీ విజయాన్నే తన ఖాతాలో వేసుకున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఈ సారి ఎన్టీఆర్తో సినిమా చేయనున్నాడని సమాచారం. వీరిద్దరి కలయికలో 'అరవింద సమేత' వచ్చింది. ఈసారి యాక్షన్ జోలికి వెళ్లకుండా సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించాలని ఈ డైరెక్టర్ భావిస్తున్నాడు. వచ్చే నెలలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Last Updated : Feb 17, 2020, 8:04 PM IST