తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్.ఆర్.ఆర్'లో ఎన్టీఆర్ కొత్త లుక్..! - viral photo of ntr

బల్గేరియాలో జరుగుతున్న 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్​లో తారక్​ దిగిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్​ను ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి లుక్​లో చూడలేదంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

'ఆర్.ఆర్.ఆర్'లో ఎన్టీఆర్ కొత్త లుక్..!

By

Published : Oct 12, 2019, 4:26 PM IST

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న'ఆర్‌.ఆర్‌.ఆర్‌' చిత్రీకరణ బల్గేరియాలో జరుగుతోంది. హీరోల్లో ఒకరైన జూ.ఎన్టీఆర్‌పై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే ఈ దర్శకుడి పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్‌ ఏదైనా విడుదల చేస్తారనిఅభిమానులు ఎదురుచూశారు. కానీ చిత్రబృందం ఎటువంటి సర్‌ప్రైజ్‌ ఇవ్వలేదు.

బల్గేరియా షూటింగ్​లో ఎన్టీఆర్

తాజాగా ఈ సెట్‌ నుంచి ఓ ఫొటో బయటకు వచ్చింది. ఇందులో రాజమౌళి, తారక్‌ మరో వ్యక్తితో కలిసి ఉన్నారు. వ్యవసాయ క్షేత్రంలో ఈ ముగ్గురు నవ్వులు చిందిస్తూ ఫొటోకు ఫోజిచ్చారు. రాజమౌళి నల్ల టోపీ ధరించి, కళ్లజోడు పెట్టుకొని ఉండగా, తారక్‌ నలుపు టీషర్ట్​తో సింపుల్‌గా కనిపించి అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు. కాస్త బరువు తగ్గి స్లిమ్​గా ఉన్న ఈ హీరోను చూసి.. 'తారక్‌ కొత్త లుక్‌ బావుంది. ఇలా ఎప్పుడూ చూడలేదు' అంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.

ఇది చదవండి: ఎన్టీఆర్ సన్నగా మారాడు.. రాజమౌళికి వయసు పెరిగింది

ABOUT THE AUTHOR

...view details