భారత పర్యటనలో ఉన్న అకాడమీ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్, సైన్సెస్(ఏఎమ్పీఏఎస్) అధ్యక్షుడు జాన్బెయిలీ భారతీయ సినిమాల గురించి ముంబయిలో మాట్లాడారు. తమకు భారతీయ చిత్రాల గురించి తెలియదని, వాటిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం తీసుకురావాల్సిన బాధ్యత ఇక్కడి సినీ ప్రముఖులకుందని ఆయన అన్నారు.
'ప్రచారంతోనే భారతీయ సినిమాకు ప్రాముఖ్యం' - academy
భారతీయ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరముందని అకాడమీ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్, సైన్సెస్ అధ్యక్షుడు జాన్ బెయిలీ అన్నారు. ఇక్కడి సంస్కృతులను, గొప్పతనాన్ని సినిమాల ద్వారా విశ్వవ్యాప్తం చేయాలని తెలిపారు.

"భారతీయ చిత్ర పరిశ్రమ.. ప్రపంచంలో అత్యంత ధనిక చిత్రసీమల్లో ఒకటి. ఇక్కడ చాలా సంస్కృతులు, భాషలు, పౌరాణిక గాథలు ఉన్నాయి. కానీ మాకు బాలీవుడ్లో వచ్చే మ్యూజికల్ ఫాంటసీ చిత్రాల గురించే తెలుసు. భారతీయ సినిమాలు గురించి మాకు పూర్తిగా తెలియదు. ఇది మా ఒక్కరే తప్పే కాదు. భారతీయ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించండి. ఇక్కడి సంస్కృతులను, గొప్పతనాన్ని సినిమాల ద్వారా చాటిచెప్పండి" - జాన్ బెయిలీ, ఏఎమ్పీఏఎస్ అధ్యక్షులు
అమెరికా లాస్ఏంజెల్స్లోని అకాడమీ మ్యూజియంలో భారతీయ సినిమా ప్రాతినిధ్యాన్ని జాన్ బెయిలీ ప్రోత్సహించారు. భారత్లో అకాడమీ మోషన్ పిక్చర్స్ కార్యాలయం ప్రారంభించేందుకు మద్దతు తెలిపారు. హాలీవుడ్లో కంటే భారత్లో ఎక్కువ సినిమాలు రూపొందిస్తున్నారని ప్రశంసించారు.